స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్మోహన్రెడ్డి కసరత్తు: పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ఉదయం నుండి రాత్రి వరకు ఏకధాటిగా సాగిన ఈ భేటీలో జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై చర్చించామని, క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేయాలని జగన్ స్పష్టం చేశారని నేతలు పేర్కొన్నారు.