విద్యార్థులకు అలర్ట్: పదో తరగతి, ఇంటర్ డమ్మీ అడ్మిట్ కార్డులు విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: పాట్నా

బిహార్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల విద్యార్థుల కోసం డమ్మీ అడ్మిట్ కార్డులను విడుదల చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ ఏడో తేదీ వరకు అధికారిక వెబ్సైట్ల నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. హాల్టికెట్లలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.