యువతను ఆకట్టుకునేలా ప్రణమ్ దేవరాజ్ 'శ్రీరస్తు' ఫస్ట్ లుక్

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా శంకర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'శ్రీరస్తు'. హరి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.