ఇందుకూరుపేటలో విషాదం: గుండెపోటుతో శ్రీచాముండేశ్వరి ఆలయ ధర్మకర్త మృతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఇందుకూరుపేట
శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు కేతిరెడ్డి నారాయణరెడ్డి శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నానికి చెందిన ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్థానికంగా ఆయన మరణం తీరని లోటని నాయకులు పేర్కొంటూ నివాళులు అర్పించారు.