రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం వైసీపీ ప్రత్యేక వ్యూహాలు
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను విశ్లేషిస్తూ అభ్యర్థుల ఎంపిక, సీనియర్ నేతల స్థానాలు, నియోజకవర్గాల బాధ్యతల విషయంలో ఈసారి ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల వ్యూహం కోసం కపిల్ సాహు బృందం సేవలను వినియోగించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.