భారీ నకిలీ నోట్ల దందా గుట్టురట్టు: ఆరు కోట్ల కరెన్సీ పట్టివేత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పెద్దఅంబర్‌పేట
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో భారీ నకిలీ నోట్ల దందాను పోలీసులు భగ్నం చేసినట్టు సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. ఈ నెల మొదటి తేదీన రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో తనిఖీలు నిర్వహించగా, కారులో తరలిస్తున్న ఎనిమిది లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కుంట్లూరు కేంద్రంగా నకిలీ నోట్లు తయారు చేస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి మొత్తం ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేసినట్లు సీపీ స్పష్టం చేశారు.