కృష్ణా జలాల తరలింపుపై కాంగ్రెస్ సర్కార్ నిద్ర వీడాలన్న పీజీఆర్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గుర్రంపోడు

ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలు తరలిపోతున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పీజీఆర్ తీవ్రంగా విమర్శించారు. గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా కోసం వెంటనే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.