ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున మూడు గంటలకు ట్రాలీ వాహనంపై విగ్రహాన్ని ఎక్కించి, ప్రత్యేక పూజల అనంతరం ఉదయం ఆరు గంటలకు శోభాయాత్రను ప్రారంభించారు. ఎన్టీఆర్ పార్కు ఎదురుగా ఉన్న నాల్గో నంబర్ క్రేన్ వద్దకు ఈ యాత్ర చేరుకోనుంది. ఉత్సవ కమిటీ, జీహెచ్ఎంసీ మరియు పోలీసులు సంయుక్తంగా మధ్యాహ్నం ఒంటిగంటకల్లా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు.