ఖమ్మం రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీల్లో లభించిన గంజాయి
రిపోర్టర్: Narendra kumar kinnera
స్థలం: ఖమ్మం రూరల్
ఖమ్మం రైల్వేస్టేషన్లో చేపట్టిన తనిఖీల్లో ఏడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ సురేశ్ గౌడ్ తెలిపారు. ప్లాట్ఫామ్-1 పార్కింగ్ ప్రాంతంలో ఒడిశాకు చెందిన గజేంద్రనాయక్ వద్ద మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయల విలువైన గంజాయి లభించిందని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ సలామ్, సిబ్బంది పాల్గొన్నారు.