తుఫాను బాధితులకు భారీ ఊరట: ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Amaravati

తుఫాను బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు తుఫాను బాధిత కుటుంబాలకు నిత్యావసరాలతో పాటు భారీ ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు బియ్యం, కందిపప్పుతో పాటు ప్రత్యేక సహాయంగా వెయ్యి రూపాయలు అందిస్తామన్నారు. అలాగే మత్య్సకారులు, చేనేతలు, ఉపాధి కోల్పోయిన వర్గాలకు మరియు పంట నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం కింద ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.