సిలబస్‌ మార్పులపై వస్తున్న వదంతులు నమ్మవద్దని టీజీపీఎస్సీ స్పష్టీకరణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఉద్యోగ నియామక పోటీ పరీక్షల సిలబస్‌లో భారీ మార్పులు జరగనున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఊహాగానాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా ముగింపు పలికింది. సిలబస్‌ను మార్చేందుకు ప్రత్యేకంగా తాము ఎలాంటి కమిటీని నియమించలేదని స్పష్టం చేసింది. ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే కనీసం ఏడాది ముందే తెలియజేస్తామని, నిరుద్యోగులు వదంతులు నమ్మకుండా ప్రిపరేషన్‌పైనే దృష్టి పెట్టాలని కమిషన్ సూచించింది.