శర్వానంద్ భోగి చిత్రం నుంచి అన్నయ్య పానం పాట విడుదల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి చిత్రం నుంచి రెండో గీతమైన అన్నయ్య పానం పాటను దసరా పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించిన ఈ పాటను చంద్రబోస్ రచించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కేకే రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం స్పష్టం చేసింది.