ఇట్లు అర్జున సినిమా విడుదల తేదీ ప్రకటన: నవంబర్ 13న థియేటర్లలోకి
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
మూగ యువకుడి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఇట్లు అర్జున సినిమాను నవంబర్ పదమూడో తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తుండగా మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నారని మేకర్స్ వెల్లడించారు. అగ్ర నటుడు నాగార్జున ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.