నా పేరు వెనుక పెద్ద కథే ఉందంటూ నటి మమిత బైజు వెల్లడి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
తన పేరు మార్పు వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాన్ని ప్రముఖ నటి మమిత బైజు ఓ ఇంటర్వ్యూలో తాజాగా బయటపెట్టారు. పుట్టిన సమయంలో తల్లిదండ్రులు తనకు నమిత అని పేరు పెట్టారని, అయితే బర్త్ సర్టిఫికెట్ నమోదు చేసే సమయంలో అధికారుల పొరపాటు వల్ల అది కాస్తా మమితగా మారిపోయిందని ఆమె వెల్లడించారు. నాలుగేళ్ల వయసులో స్కూల్ లో చేర్పించే సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.