హైదరాబాద్‌లో ఘనంగా ఇట్లు అర్జున సినిమా టీజర్ లాంచ్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
వెంకీ కుడుముల నిర్మాణంలో వాట్ నెక్ట్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై మహేశ్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇట్లు అర్జున. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వెంకీ కుడుముల, దర్శకుడు మహేశ్ ఉప్పల, నటీనటులు అనీష్, అనస్వర రాజన్ తదితరులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.