కంటి వ్యాధుల చికిత్సకు ముందుకు: పాండోరమ్ టెక్నాలజీస్తో భారత్ బయోటెక్ భాగస్వామ్యం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బెంగళూరు

కంటి వ్యాధులకు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేసే దిశగా భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ అడుగు ముందుకేసిందని, బెంగళూరుకు చెందిన పాండోరమ్ టెక్నాలజీస్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. తీవ్రమైన కార్నియా వ్యాధి, వెట్ ఏఎండీ చికిత్సల కోసం ఈ ఒప్పందం కుదిరిందని, ఈ ప్రాజెక్టులకు రూ.16.97 కోట్ల వ్యయం అంచనా వేసినట్లు వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.8 కోట్ల ఆర్థిక సహాయం అందనుందని సంస్థ స్పష్టం చేసింది.