పలాస కాశీబుగ్గ మున్సిపల్ పోరులో చంద్రశేఖర్ త్యాడి ఘన విజయం
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం ఎన్నికల్లో పదిహేడో వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి చంద్రశేఖర్ త్యాడి తన సమీప ప్రత్యర్థి శ్రీను పండపై రెండు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచి గెలిపించిన వార్డు ఓటరు దేవుళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.