అరసాడలో దెబ్బతిన్న కాజ్ వే రోడ్డును పరిశీలించిన మంత్రులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడ గ్రామం వద్ద దెబ్బతిన్న కాజ్ వే రోడ్డును శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పరిశీలించారు. రాకపోకలు నిలిచిపోయిన ప్రాంతాన్ని సందర్శించి నష్టాన్ని అంచనావేశారు. వరద బాధితులకు న్యాయం చేయాలని, రహదారిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని వారు స్పష్టం చేశారు.