ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ను సోమవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా పెండింగ్ భూసేకరణ కేసుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.