న్యూజిలాండ్ పర్యటనకు భారీ స్పందన, 50 వేలకు పైగా టికెట్లు విక్రయం
రిపోర్టర్: కిరణ్
స్థలం: న్యూఢిల్లీ
భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనపై క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కేవలం రెండు వారాల్లోనే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఆరు సంవత్సరాల తర్వాత భారత్ కివీస్‌లో పర్యటిస్తుండటంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలున్నాయి. పలు మ్యాచ్‌లకు టికెట్లు వేగంగా అమ్ముడవుతుండటంతో నిర్వాహకులు ఈడెన్ పార్క్‌లో అదనపు సీట్లను అందుబాటులోకి తెస్తున్నారు.