అనంతపురం విద్యార్థినికి మెరుగైన వైద్యం: బెంగళూరు ఆస్పత్రికి తరలింపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో ఉన్మాది దాడికి గురైన పదో తరగతి విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ మేరకు బాధితురాలను బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించినట్లు మంత్రి వెల్లడించారు. బాలిక ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైద్యులతో సమన్వయం చేసుకుంటున్నామని జిల్లా అధికారులు తెలిపారు.