మత్స్యకారుల ప్రాణరక్షణకు ఉచితంగా ట్రాన్స్పాండర్ల పంపిణీ చేస్తున్న ప్రభుత్వం
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల ప్రాణరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.36,400 విలువైన ట్రాన్స్పాండర్లను ఉచితంగా అందిస్తున్నాయి. 370 కిలోమీటర్ల పరిధిలో శాటిలైట్ ట్రాకింగ్ చేసే ఈ పరికరాల ద్వారా వాతావరణ హెచ్చరికలు, సరిహద్దు దాటకుండా అప్రమత్తం చేయడం సాధ్యమవుతుంది. అయితే పడవ ప్రమాదాల సమయంలో ట్రాన్స్పాండర్లు ఆన్ చేయకపోవడం వల్ల ప్రాణనష్టం జరుగుతున్న నేపథ్యంలో, వీటి వినియోగాన్ని కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.