బిగ్ బాస్ హౌస్ నుంచి షాలిని దామేర సంచలన ఎలిమినేషన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా తాజాగా విడుదలైన ప్రోమోలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎలాంటి ముందస్తు నామినేషన్ లేదా ఓటింగ్ ప్రక్రియ లేకుండానే కంటెస్టెంట్ షాలిని దామేరను హౌస్ నుంచి బయటకు పంపించినట్లు చూపించారు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన భయానక వాతావరణంలో గ్రిమ్ రీపర్స్ ఎంట్రీ ఇచ్చి, బాక్స్‌ను తాకిన షాలినిని మెయిన్ డోర్ గుండా తీసుకెళ్లడంతో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.