పేదల భూముల తొలగింపులో ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరి

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో ప్రభుత్వం నిషేధిత 22ఏ జాబితా నుంచి పేదల భూములను కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి డిమాండ్ చేశారు. నిషేధిత భూముల జాబితా కారణంగా రాష్ట్రంలో వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.