పీజీ డెంటల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలోని ప్రైవేట్ నాన్-మైనారిటీ డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పీజీ డెంటల్ ఎండీఎస్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ ఎండీఎస్ 2026 అర్హత సాధించిన అభ్యర్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ నెల 24వ తేదీ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్ తెలిపారు.