నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు: వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థుల విశ్వప్రయత్నాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపు కోసం మేయర్ మరియు కార్పొరేటర్ అభ్యర్థులు వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించారని అధికారులు తెలిపారు. ఉద్యోగం, వ్యాపారం మరియు కూలీ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న సుమారు పదిహేను వేల మంది ఓటర్లను రప్పించడానికి అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణ ఖర్చులు భరించడంతో పాటు ఎసీ బస్సుల్లో టికెట్లు బుక్ చేస్తామని ఆశ చూపిస్తూ ఫోన్ల ద్వారా ఓటర్లను బతిమాలుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నట్లు సమాచారం.