లిక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

వైయస్సార్సీపీ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కాం జరగకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో కట్టుకథ అల్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైయస్సార్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా సత్యప్రసాద్‌తో మాట్లాడిస్తూ ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారని, తొలుత లక్ష కోట్లని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.