పవన్ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా భేటీ

రిపోర్టర్: సునీల్ స్థలం: మంగళగిరి

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ సమావేశం ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రాధాన్యత సంతరించుకుంది. పాత విషయాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.