గంగవరంలో ఘనంగా వరసిద్ధి వినాయక అన్నసమారాధన

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గంగవరం జాలారిపల్లి పాలెంలో ఫ్రెండ్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక మహోత్సవాల సందర్భంగా భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు ఘనంగా సన్మానించారు. గ్రామానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.