అద్దంకిలో విద్యుత్ మరియు అగ్నిమాపక సేవలు ప్రారంభించిన మంత్రి
రిపోర్టర్: వెంకట్
స్థలం: అనకాపల్లి
అద్దంకి పర్యటనలో భాగంగా ప్రజలకు మెరుగైన విద్యుత్, అగ్నిమాపక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్థానికంగా నూతన సబ్స్టేషన్, అగ్నిమాపక కేంద్రం మరియు అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించామని వెల్లడించారు. ప్రజల భద్రత, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం ముందుకు తీసుకువెళ్తోందని ఆమె స్పష్టం చేశారు.