నీట్ పేపర్ లీక్ కేసులో ఆదిత్యపై ఎన్టీఏ నిషేధం
రిపోర్టర్: నరేష్
స్థలం: లతూరు
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు శివరాజ్ మోతేగోడ్కర్ కుమారుడు ఆదిత్య మోతేగోడ్కర్పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కఠిన చర్యలు తీసుకుంది. పరీక్షలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో అతని ఫలితాన్ని నిలిపివేయడంతో పాటు, రెండేళ్ల పాటు నీట్-యూజీ పరీక్ష రాయకుండా నిషేధం విధించింది. లాతూరులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న శివరాజ్ మోతేగోడ్కర్ ప్రస్తుతం సీబీఐ అదుపులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.