చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఘన నివాళులు అర్పించిన ఈటల రాజేందర్
రిపోర్టర్: నరేష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ యోధురాలికి నివాళులు అర్పించినట్లు ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.