టీమిండియా జట్టులోకి మహమ్మద్ షమీ రీఎంట్రీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్లలో స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కకపోవడంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫిట్నెస్తో పాటు దేశవాళీ క్రికెట్లోనూ నిలకడగా రాణిస్తున్న షమీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని ఆయన స్పష్టం చేశారు. అనుభవం కలిగిన బౌలర్లను పక్కన పెట్టడం సరికాదని, టెస్టులు, వన్డేల్లో అతడు రీఎంట్రీ ఇచ్చేందుకు అర్హుడని రవిశాస్త్రి పేర్కొన్నారు.