డీఎస్సీ అక్రమాలపై గవర్నర్‌ను కలవనున్న మాజీ సీఎం జగన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Tadepalli

డీఎస్సీ నియామకాల అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ చేపట్టిన శాంతియుత ర్యాలీలపై టీడీపీ వర్గాలు దాడి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తాడేపల్లిలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.