ఆలేరులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆలేరు
ఆలేరులోని ఎస్సార్ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. దేశ అభివృద్ధికి బలమైన పునాది తరగతి గదిలోనే పడుతుందని, అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని ప్రిన్సిపల్, కరస్పాండెంట్ పేర్కొన్నారు.
గురువు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను సంప్రదాయబద్ధంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.