ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్కు సుప్రీంకోర్టు నిరాకరణ

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారత ప్రధాన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం నిర్ణయాలపై ఏకపక్ష ఆరోపణలు రావడంతో, తదుపరి విచారణ నిమిత్తం ఈసీకి నోటీసులు జారీ చేసినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించేందుకు కఠిన నిబంధనలు ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది.