బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ తెలుగు 10 రియాలిటీ షోలో పద్దెనిమిదో రోజు ఉత్కంఠభరితంగా సాగింది. కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా జరిగిన బజర్ టాస్క్‌లో త్రిగుణ్ నిర్ణయం గందరగోళానికి దారితీసింది. వంశీ, నరేష్ మధ్య చోటుచేసుకున్న వివాదం హౌస్‌లో తీవ్ర చర్చకు కారణమైంది. చివరకు ఝాన్సీ కెప్టెన్సీ కంటెండర్‌గా విజయం సాధించింది. మరోవైపు అగ్ని పరీక్ష నుంచి వచ్చిన మిథిలేష్, అపూర్వ, రామకృష్ణల ఎంట్రీతో షో మరింత రసవత్తరంగా మారింది.