ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ భద్రత మరింత పెంపు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వివాదం మరియు నిరసనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ మరియు ఆగ్రాలోని ఆయన నివాసాల వద్ద ప్రదర్శనలు జరగడంతో భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. వై ప్లస్ కేటగిరీ భద్రతలో భాగంగా కేంద్ర బలగాలతో పాటు దిల్లీ పోలీసులు నిఘా ఉంచినట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.