హైవేపై ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం వ్యాన్
రిపోర్టర్: రమేష్
స్థలం: తల్లాడ
తల్లాడ దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సును, తిరువూరు వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.