దిల్లీ మైనర్ బాలిక అత్యాచార కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: దిల్లీ

దిల్లీలోని కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితులు ఆసిఫ్, హేమంత్, ముకేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వేషధారణలో వచ్చి బాలికను బెదిరించి ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన ఆసిఫ్ పోలీసు కాల్పుల్లో గాయపడగా, మిగిలిన వారిని శ్రీనివాస్పురిలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టు నిందితులకు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.