నల్లుల సంగీత సేవలను ఘనంగా సత్కరించిన జాతీయ నేత రూప్ చౌదరి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మంచిర్యాల

తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్మల్ మహిళా మోర్చా ఇన్చార్జి నల్లుల సంగీతను జాతీయ నేత రూప్ చౌదరి శాలువాతో సత్కరించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా మోర్చా నాయకులు మరియు ప్రతినిధులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు.