అనుమతులిచ్చి కూల్చివేస్తామనడమేంటని జీహెచ్ఎంసీ తీరును తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసి ఆ తర్వాత అక్రమమంటూ కూల్చివేయాలని కోరడంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వైఖరిని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. మల్కాజిగిరి డిఫెన్స్ హౌసింగ్ సొసైటీ వివాదంపై జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ శుక్రవారం విచారణ చేపట్టినట్లు న్యాయస్థానం తెలిపింది. అనుమతులు మీరిచ్చి ఇప్పుడు కూల్చివేయాలని అడగడం ఏంటని జీహెచ్ఎంసీ అధికారులను న్యాయమూర్తి నిలదీశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేసేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు కోర్టు మూడు వారాల గడువును మంజూరు చేసింది.