బాపట్ల జిల్లాలో కరవు మండలాల ఎంపికకు ముమ్మర కసరత్తు

రిపోర్టర్: విజయ్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా 20 మండలాల్లో 43.4 శాతం లోటు వర్షపాతం నమోదైంది. చివరి ఆయకట్టు భూములకు నీరందక వేల ఎకరాల్లో వరి పైరు ఎండిపోవడంతో రైతులు పంటను ట్రాక్టర్లతో దున్నేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు కసరత్తు చేస్తుండగా ఈ నెల 21 నాటికి నివేదికను కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి పంపనున్నారు.