దిల్లీలో మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తుల సామూహిక అత్యాచారం
రిపోర్టర్: సునీల్
స్థలం: దిల్లీ
దేశ రాజధాని దిల్లీలోని కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కులో మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాము పోలీసులమంటూ బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.