ముక్కాం బీచ్ శుభ్రతా కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగ మాధవి
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి స్వయంగా శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. జడ్పీహెచ్ పాఠశాల విద్యార్థులు, అధికారులతో కలిసి ఆమె తీర ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు. మన సముద్రం మన బాధ్యత అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.