'పూర్వవైభవం రావాలి': బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న గబ్బర్‌సింగ్ నటుడు రమేశ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 'గబ్బర్‌సింగ్' చిత్ర నటుడు రమేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. కొద్దికాలం క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న ఆయన, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో క్రమంగా కోలుకుంటున్నారు. ఈ కష్టకాలంలో ఆయనకు ఇష్టమైన పవన్ సినిమాలను చూపిస్తూ కుటుంబ సభ్యులు మానసిక స్థైర్యాన్ని నింపుతుండగా, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కొందరు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.