తీవ్ర తుఫాను ప్రభావం: రైల్వే శాఖ అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో వీస్తున్న తీవ్రమైన ఈదురుగాలులు మరియు తుపాను పరిస్థితుల కారణంగా రైల్వే రవాణా వ్యవస్థ ప్రభావితమైందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. తుపాను ధాటికి సుమారు పది ప్రాంతాల్లో రైల్వే లైన్లపై భారీ చెట్లు కూలిపోయాయని, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.