సంగారెడ్డి జిల్లాలో డిజిటల్ విద్య: స్మార్ట్ క్లాస్ రూమ్లను ప్రారంభించిన మంచు లక్ష్మి
రిపోర్టర్: రమేష్
స్థలం: సంగారెడ్డి
గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి డిజిటల్ విద్యను అందించడమే లక్ష్యంగా ‘టీచ్ ఫర్ చేంజ్’ సంస్థ ముందుకు సాగుతోందని ఆ సంస్థ చైర్పర్సన్, సినీనటి మంచు లక్ష్మి వెల్లడించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా చౌటకూరు ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నూట ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలను తమ ట్రస్ట్ దత్తత తీసుకుని, విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో విద్యా బోధన అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.