అస్సాంలో భారీ అదానీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
రిపోర్టర్: గోపి
స్థలం: Dhubri
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ధుబ్రి జిల్లాలోని చాపర్ లో 3,200 మెగావాట్ల అదానీ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. రూ.48 వేల కోట్ల భారీ వ్యయంతో ఈ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, రాష్ట్ర పవర్ రంగం మరింత బలపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.