శ్రీశైలం జలాశయంలో వేగంగా పడిపోతున్న నీటి నిల్వలు

రిపోర్టర్: రాము స్థలం: Srisailam

తెలుగు రాష్ట్రాల కీలక జలాశయమైన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడమే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించారు. ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 89.29 టీఎంసీలకు మాత్రమే పరిమితమైందని, నీటి మట్టం 850 అడుగులకు క్షీణించిందని అధికారులు పేర్కొన్నారు.